Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

అబ్బా...ప్రియమణి మళ్లీ పెంచింది!!



'పరుత్తి వీరన్' రిలీజ్ కి ముందు ప్రియమణి కేవలం 15-20 లక్షల రూపాయలకే ఎవైలబుల్ గా ఉండేది. అయితే ఆ సినిమా సంచలన విజయం సాధించటంతే తన రేటుని 25-30 లక్షలకు పెంచింది. ఆ తర్వాత తెలుగులో 'పెళ్ళయిన కొత్తలో' ,'యమదొంగ' అంటూ వరసగా విజయాలు సాధించి వరస ఆఫర్స్ సంపాదించింది. ఈలోగా తమిళంలో జీవన్ ప్రక్కన తొట్టా,విశాల్ తో మలై కోటై చేసింది. రెండూ ఏవరేజ్ బిజినేస్ చేసాయి. మలైకోటై (భయ్యా డబ్బింగ్) వందరోజులు అతి కష్టం మీద లాగింది. ఈలోగా ఇక్కడ చేసిన నవవసంతం వర్కవుట్ కాలేదు. హరేరామ్ ఏవరేజ్ రిపోర్ట్ సొంతం చేసుకుంది. దాంతో కొంత డౌన్ అయింది. ఎవరు ఎంత ఆఫర్ తో వచ్చినా ఒప్పుకుంటూ పాత్ర నచ్చితే చాలని బిల్డప్ లు ఇచ్చింది.

ఈలోగా 'పరుత్తి వీరన్' లో ఆమె పాత్రకి జాతీయ అవార్డు వచ్చింది. దాంతో ఆమె మళ్ళీ ఉత్సాహ తెచ్చుకుని 45-50 మద్యకు తన రెమ్యునేషన్ పెంచింది. ఈ పెంచిన రేటుతో తాజాగా భరత్ ప్రక్కన ఆర్ముగం చిత్రంలో బుక్కయింది. ఇంతలో మణిరత్నం దగ్గరనుండి కబురు రావటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే నిర్మాతల్లో మాత్రం మళ్ళీ రేటు పెంచుతుందా అని గుండె గుబులు ప్రారంభమయిందిట. షేరు మార్కెట్ లా రోజు రోజుకీ పరిస్ధితులను బట్టి తన స్టాటజీని మార్చుకుంటూ అనుగుణంగా రెమ్యునేషన్ పెంచటం ఆమెకే చెల్లిందంటూ తోటి హీరోయిన్లు విమర్శిస్తున్నారు.

స్పందనలు

Re: అబ్బా...ప్రియమణి మళ్లీ పెంచింది!!
ఒక హీరోయిన్‌ రెమెన్యురేషన్ గురించి తెలిపి... సినీ రంగం పరిశ్రమలో ఏ దారిలో వెళుతుందే చెప్పకనే చెప్పారు. మరంతే కదా... ఇప్పుడు ఓ ఉద్యోగే తీసుకోండి.. తొలి ఏడాదిలో చక్కటి ప్రతిభను కనబరిస్తే.. ఇంకేముంది వచ్చే ఏడాదిలో అతని శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే కాకపోతే.. ఉద్యోగిగా కంటే కూడా చిత్ర పరిశ్రమలో ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేయవచ్చన్నమాట. అందుకే మరి ఆ రంగమంటే అందరికీ ప్రియం. అన్నట్లు చెప్పడం మరించా... మీకు వీలుంటే... లేదు టైముంటే.. ప్లీజ్ విజిట్ మై బ్లాగ్... థ్యాంకు..
నిరాకరణ